రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.

టిపిసిసి నాయకులు వై.నరోత్తం
జహీరాబాద్ నవంబర్ 30 (జనం సాక్షి )
కేంద్రములోని బీజేపి,రాష్ట్రంలోని టిఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు గత 8 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా రైతులకు చేసిన మేలు ఏమి లేదు అని టిపిసిసి నాయకులు నరోత్తం అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో,రాష్ట్రంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు,రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పడమే కానీ అది సక్రమంగా అందరికి అందడం లేదు,రైతు రుణమాఫీ అన్నారు కానీ ఏ ఒక్క రైతుకు రుణమాఫీ జరిగింది లేదు,రైతులకు రైతుబందు ఇస్తున్నామని చెప్పి రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఇచ్చే సబ్సిడీలను అన్నిటినీ రద్దు చేయడం జరిగింది,రైతులకు సబ్సిడీపై డ్రిప్ప రికరాలు,వ్యవసాయ పరికరాలు,ఎరువులు,విత్తనాలు ఇవన్నీ అందేవి,ప్రస్తుతం అన్నిటినీ రద్దు చేసి రైతు బంధు ఇవ్వడం వల్ల రైతులకు నష్టమే జరుగుతున్నది అన్నారు. ,ఈ ప్రభుత్వం ధరణి పోర్టల్ పెట్టి రైతులను నానా రకాలుగా వేధిస్తూ పైశాచిక ఆనందం పొందడం దుర్మార్గపు చర్య,రైతులకు కావాల్సింది సబ్సిడీపై అందించే ఎరువులు, విత్తనాలు,వ్యవసాయ పరికరాలు,డ్రిప్ పరికరాలు,రైతులు పంట నష్టపోతే పంట నష్టపరిహారం అందించాలి, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో చెరుకుకు సరైన మద్దతు ధర ప్రకటించి,సకాలంలో బిల్లులు చెల్లించి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ,రైతుల సమస్యలపై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి  ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల పక్షాన ఉండి రైతుల కొరకు పోరాటం చేయుటకు ఆందోళనలకు పిలుపునిచ్చారని అన్నారు.ఈ.కార్యక్రమంలో గుడుపల్లి ఎంపిటిసి సుదర్శన్ రెడ్డి,  మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీటీసీ పి.నాగిశెట్టి,కో ఆప్షన్ సభ్యులు మైనోద్దీన్,యం.డి.యూసుఫ్, పిఏసీఎస్ డైరెక్టర్ జేట్ఠప్ప,ముకుంద్ రెడ్డి,  నాగరాజ్,శెట్టి,తదితరులు ఉన్నారు