రైతు కుటుంబాలను ఆదుకోవాలి

కర్నూలు,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రైతులను ఆదుకోవాలంటూ.. సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలులో శనివారం నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో కరువు వల్ల పంటలు దెబ్బ తిని అప్పుల బాధ తాళలేక అత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను, ప్రభుత్వం ఆదుకోవాలని ఈ దీక్షలు ప్రారంభించారు. సిపిఎం ఆధ్వర్యంలో 48 గంటల పాటు ఈ దీక్షలు కొనసాగనున్నాయి. సిపిఎం రాయలసీమ అభివృద్ధి కమిటీ నాయకులు జి.ఓబులు ఈ దీక్షలను ప్రారంభించారు.

తాజావార్తలు