– రైతు బంధు గివ్ అప్ ఇచ్చిన చక్రధర్ గౌడ్….
– అభినందించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
– అసలైన రైతులకు న్యాయం చేద్దామని పిలుపు
ఫోటో ; రైతుబంధు గివ్ అప్ కలెక్టర్ కు అందజేస్తున్న చక్రధర్ గౌడ్..
సిద్దిపేట అర్బన్, జూలై21( జనం సాక్షి): సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్, కనక లక్ష్మీ అనే వ్యక్తులు తమకు 10 ఎకరాలలో వచ్చిన రైతుబంధు చెక్కును గివ్ అప్ చేస్తూ కలెక్టర్ కు గురువారం అందజేశారు.సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో రైతు బంధు లబ్దిదారులు గాదగోని చక్రధర్ గౌడ్, కనకలక్ష్మి లు రైతు బంధు వెనక్కి తీసుకోవాలని గివ్ అప్ అంటూ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖాధికారి శివప్రసాద్ సమక్షంలో వినతి పత్రం అందించారు. దీంతో కలెక్టర్ వారిని ప్రశంసిస్తూ అభినందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ ఫార్మర్స్ ఫౌండేషన్ చైర్మన్ గా రైతుల కోసం పాటు పడుతున్నట్లు చెప్పారు. రైతు బంధు కింద లాభం పొందుతున్న వారిలో ఎక్కువ మంది అసలు రైతులే కాదని, ఆర్థికంగా ఉన్నవారు రైతుబందు పొందడం సరైంది కాదని, ఇప్పటికైనా వెంటనే రైతుబంధును తిరిగి వెనక్కి ఇచ్చేసి కష్టపడుతున్న రైతులకు అందేలా చూడాలని కోరారు. రైతులపై ప్రేమతోనే రైతుబంధు వద్దంటూ గివ్ అప్ అంటూ తిరిగి వెనక్కి ఇచ్చేశానని తెలిపారు. నిజంగా వ్యవసాయం చేసేవారిని కాకుండా భూస్వాములకు లాభం చేకూరుతుందని తెలిపారు. చిన్నకొడూర్ మండలం, ఇబ్రహీం నగర్ లో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని దీంతో తనకు రైతుబంధు తనకు అవసరం లేదని తిరిగి వెనక్కి ఇచ్చే, తనలా అందరూ ఆలోచించి ముందు