రైతు బీమా కు దరఖాస్తు ఎలా చేసుకోవాలో నియమ నిబంధనలను సూచించిన గుమ్మడిదల వ్యవసాయ అధికారి ఏవో.

జిన్నారం జులై 19 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమైన రైతు బీమా కోసం దరఖాస్తుల స్వీకరణమైనదని కావున మండలంలోని కొత్తగా 756 పట్టా పాస్బుక్కులు పొందినటువంటి రైతులు మరియు ఇదివరకు చేయించుకొని 1179 మంది రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నాము ఇందుకోసం రైతు 18 నుండి 50 సంవత్సరాలు మధ్య వయస్సు కలవారి ఉండాలని ఇందుకోసం రైతులు పి పి బి జిరాక్స్ , నామిని జిరాక్స్ దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత ఏవో గారికి అందజేయాలని ఇందుకోసం ఈనెల 31 వరకు ఆఖరు తేదిగా ప్రభుత్వం వారు ప్రకటించారని తగు సూచనలు వెల్లడించిన గుమ్మడిదల మండల విస్తరణ అధికారి  ఏవో. డి. శ్రీనివాస్ గారు తెలిపారు