రోడ్డుపై బోర్ల పడుకొని అంగన్వాడీల నిరసన

రోడ్డుపై బోర్ల పడుకొని అంగన్వాడీల నిరసన

టేకులపల్లి, సెప్టెంబర్ 30( జనం సాక్షి ): అంగన్వాడి ఉద్యోగులు రోజుకో వినూత్న రీతిలో నిరసనలు చేస్తూ నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తున్నారు. శనివారానికి 20వ రోజు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ నిరవధిక సమ్మె చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీలు రోడ్లపై బోర్లా పడుకొని నిరసన తెలిపారు. ఈనెల 11వ తేదీ నుండి నిరవధిక సమ్మె మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 20 రోజుల నుండి చర్చలకు పిలవకుండా మొండి వైఖరి కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకూ సమ్మెను ఆపేది లేదని, ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిన అందుకు సిద్ధమేనని అంగన్వాడీ ఉద్యోగులు అన్నారు. తక్షణమే కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయాలని మినీ అంగన్వాడీలను మెయిన్ టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని. రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 10 లక్షలు. హెల్పర్లకు ఐదు లక్షలు ఇవ్వాలని తదితర డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించాలని నిరసన ద్వారా తెలియజేస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిఐటియు జిల్లా నాయకులు రాయల ఇందిరా, కొండపల్లి శకుంతల, వై పద్మావతి, వి సంధ్యారాణి, ఎం నాగమణి, ఎన్ విజయలక్ష్మి, టి వరమ్మ,సుగుణ, పద్మ, వి రాజేశ్వరి, కల్తీ భద్రమ్మ, కే రాజేశ్వరి, ఐ రాధా, ఈసం అనసూయ,సుశీల,కల్తీ పద్మ తదితరులు పాల్గొన్నారు.