రోడ్డుప్రమాదంలో బాలుడి మృతి

గజ్వేల్‌టౌన్‌:పండుగ సంబరాలనుఆస్వాదించే సమయంలో రోడ్డు ప్రమాదం తల్లిదండ్రులకుపుత్రశోకాన్ని మిగిల్చింది. పేడ తీసుకొస్తానమ్మా అంటూ ఇంటి నుంచి వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. ఈ విషాదకర సంఘటన సోమవారం ఉదయం పట్టణంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం. స్థానికంగా పిండిగిర్ని నిర్వహించుకునే పోచయ్య కుమారుడు 8వ తరగతి చదువుతున్న ప్రవీణ్‌కమార్‌(15) ఉదయం ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టడానికిపేడ తీసుకొస్తానని దిచక్రవాహనంపై సంగాపూర్‌ రోడ్డువైపు వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీ కొట్టింది. ముందు చక్రంలో ఇరుక్కుపోయిన అతన్ని ట్రాక్టర్‌ కొంతదూరం అలాగే నెట్టుకురావడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలనికి చేరుకుని కంటతడి పెట్టారు. పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.