రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సూర్యాపేట,ఆగస్ట్11(జనం సాక్షి): చివ్వెంల మండలం గుంజలూరు వద్ద జాతీయ రహదారి(65)పై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులున్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఒకరి వద్ద లభించిన ఆధారం మేరకు వీరంతా వరంగల్ జిల్లాకు చెందిన వారని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.