రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ న్యాయమూర్తి మృతి
చెన్నై : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చైన్నైలో చికిత్స పొందుతున్న గుంటూరు రెండో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. ఈనెల 1న ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన్ని చైన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.



