రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి పరామర్శ
హైదరాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి): గజ్వెల్ సవిూపంలోని రిమ్మనగూడ ప్రమాద బాధితులను మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో 23 మంది ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రమాద వివరాలతో పాటు వాళ్ల ఆరోగ్య సమస్యలు, వాళ్లకు అందుతున్న వైద్యం వివరాలను మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని మంత్రి నిమ్స్ అధికారులను ఆదేశించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందిస్తామని మంత్రి హావిూ ఇచ్చారు. అనంతరం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కొండగట్టు ప్రమాద బాధితులను మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి నిమ్స్ వైద్యులను ఆదేశించారు. మంత్రి వెంట డిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథం, మహబూబ్‌నగర్ జడ్పీ చైర్మన్ బండారు భాస్కర్, నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, ఎమ్జ్గం/న్సీ విభాగం అధిపతి ఆశిమా శర్మ, ఆర్‌ఎమ్‌వోలు, వివిధ విభాగాల డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.