లండన్‌లో స్వర్ణం గెలిస్తే కాసుల వర్షమే
తమ అథ్లెట్లకు హర్యానా సీఏం బంపర్ ఆఫర్
న్యూఢీల్లి: పతి క్రీడాకారుని చిరకాల స్వప్నం ఒలిపింక్ మెడల్ గెలుచుకోవడం రేపటి నుంచి ప్రారంభం కాబోయో లండన్ ఒలిపింక్స్ భారత క్రీడాకారుల జీవితాలను మార్చేయనుంది. మెడల్ గెలిస్తే కాసుల వర్షంలో ముంచెత్తేందుకు ప్రభుత్వంతో పాటు పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నజరనాలు ప్రకటించేశాయి. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి భూసేందర్‌సింగ్ హూడా తమ క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. లండన్‌లో గోల్డ్‌మెడల్ గెలిచిన హర్వానా క్రీడాకారులకు రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇది వ్యక్తిగతంగా కావచ్చు. లేదా టీమ్ ఈవెంట్‌లోనైనా కావచ్చు, గోల్డ్ గెలిస్తే 2.5 కోట్ల క్యాష్ సొంతమవుతుందిని చెప్పారు. అలాగే వెండి పతకం గెలిస్తే 2.5 కోట్ల క్యాష్ కాంస్యం నెగ్గితే కోటి రూపాయల ప్రైజ్‌మని ఇవ్వనున్నట్లు తెలిపారు. కేవలం ఒలింపిక్సే కాకుండా పారా ఒలిపింక్స్‌లో పతకాలు గెలిచిన రాష్ట్ర క్రీడాకారులు ఎవరైనా ఇదే రితీలో ప్రైజ్‌మనీ ఇస్తామని స్పష్టం చేశారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా తాము ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు హుడా చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రకటించిన నజరానాలు రెండు రెట్లు ఎక్కువ బీజింగ్ ఒలిపింక్స్‌లో మెడల్స్ గెలిచినా హర్యాన ఆణిముత్యాలు సుశీల్ కుమార్, విజేందర్ సింగ్ 50 లక్షల చొప్పున నజరానా దక్కింది. ఇది లాఉంటే లండన్ ఒలిపింక్స్‌లో భారత్ నుంచి 81 మంది పోటిపడుతున్నారు. వారి 18 మంది హర్యానాకు చెందిన వారే వదేశంలో చిన్న రాష్ట్రంగా పేరున్న హర్యానా నుంచి ప్రస్తుత ఒలిపింక్స్‌లో మెడల్ గెలుస్తరన్న ఢీమా ఉన్న వారినలో సుశీల్‌కుమార్, విజేందర్, గగన్ నారంగ్ బరిలో ఉన్నారు. ముఖ్యంగా బాక్సింగ్ ఏడుగురు ఒలిపింక్స్ బరిలో ఉంటే వారిలో ఐదుగురు హర్యానాకు చెందిన వరాఇటవే కావడం విశేషంగా చెప్పొంచ్చు. ప్రభుత్వ ప్రోత్సహపరంగా హర్యానా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే భారీ నజరనాలు ఇస్తోంది. అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పతకం గెలిచినా… నజరానాలు అందిస్తోంది..