లచ్చంపూర్‌లో నేడు కవి సమ్మేళనం

ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య రచించిన ఆత్మ సాక్షాత్కారం, మానవద్గీత పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించ నున్నారు. తలమడుగు మండలం లచ్చంపూర్‌ గ్రామంలో దీనిని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కవిసమ్మేళనం, మధ్యాహ్నం ఒంటి గంటకు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొనే కవులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 93903 07565కు సెల్‌ నంబర్‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శ్రీశ్రీశ్రీ యోగానంద సరస్వతి స్వామిజీ, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, టీడీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. యోగి పరమేశ్వరయ్య భక్త బృందం, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు.

తాజావార్తలు