లాభాల్లో స్టాక్ మార్కెట్లు
– 10,800 మార్కును దాటిన నిఫ్టీ
ముంబాయి, జూన్22(జనం సాక్షి ) : అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో దేశీయ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి తీవ్ర ఒడుదొడుకులకు లోనైన స్టాక్ మార్కెట్లు చివర్లో ఊపందుకున్నాయి. దీంతో శుక్రవారం మార్కెట్లు ముగిసే సరికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 257.21 పాయింట్లు లాభపడి 35,689.60 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 80.75 పాయింట్లు ఎగబాకి 10,822 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీలో సన్ ఫార్మా(3.91శాతం), ఎం అండ్ ఎం(2.87శాతం), హెచ్‌డీఎఫ్‌సీ(2.54శాతం), ఎస్‌బీఐఎన్(1.69శాతం), ఐటీసీ(1.67శాతం) ఎక్కువగా లాభపడగా, మరో వైపు రిలయన్స్(1.94శాతం), కోల్ ఇండియా(0.99శాతం), టీసీఎస్(0.44శాతం), విప్రో(0.41శాతం), అదానీ పోర్ట్స్(0.23శాతం) అత్యధికంగా నష్టపోయాయి.