లాభాల బాటలో సూచీలు

ముంబయి,నవంబర్‌15(జ‌నంసాక్షి): దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయ మార్కెట్లలోకి కొత్తగా విదేశీ పెట్టుబడులు రావడంతో మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాలను ఆర్జించాయి. ఉదయం ఫ్లాట్‌గా

ప్రారంభమైన సూచీలు కొనుగోళ్ల అండతో లాభాల బాట పట్టాయి. ఒక దశలో 150 పాయింట్ల వరకు లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 118 పాయింట్ల లాభంతో 35,260 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 10,617 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.10గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో అదానీ పోర్ట్స్‌, టైటాన్‌, ఐషర్‌ మోటార్స్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, హీరో మోటార్స్‌ షేర్లు లాభపడగా.. గ్రాసిమ్‌, యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ్గ/నాన్స్‌ లిమిటెడ్‌, ఎన్టీపీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు నష్టపోయాయి.