లూపస్ వ్యాధి ప్రజల్లో అవగాహన ఉందా

లూపస్ అనే సమస్య రోగనిరోధక శక్తి వ్యవస్థ తక్కువగా ఉన్న వారిలో ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా ఆడ, మగవారిలో ప్రభావం చూపే సమస్య లూపర్స్.లూపస్ సమస్య అందరిలో ఒకే విధంగా రాకపోవచ్చు,

లూపస్ లక్షణాలు

సిస్టమ్యటిక్ లూపస్, ఈ సమస్య వస్తే శరీరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, శరీరంలో జాయింట్ పెయిన్స్, మూత్రంలో ప్రోటీన్స్ పోవడం, ఎక్కువగా బిపి ఉండడం, జుట్టు ఊడిపోవడం, ముఖంపైన (బటర్ఫ్లై ర్యాషెస్ ) సీతాకోక చిలకల ఉండే ఆకృతితో దద్దులు రావడం, తలలో ఒక వైపు తలనొప్పి, శరీరంలో రక్తం తగ్గడంతో పాటు, గుండె అధికముగా కొట్టుకోవడం, కిడ్నీకి సంబంధించిన సమస్యలతో వాపు రావడం, నీరసంగా ఉండటం,లివర్ సమస్య, ఎక్కువ దూరం నడవకపోవడం, కూర్చొని లేకపోవడం, శరీర రోగనిరోధక శక్తి వ్యవస్థ అదుపు తప్పడంతో ఒక అవయవం మీదనే కాకుండా శరీరంలో ఉండే మెదడు, కళ్ళు, గుండె, కిడ్నీలు, చర్మం, శరీరంలోని (అన్ని జాయింట్లలో ) రెండు ఎముకల మధ్య కలయిక భాగంలో నొప్పి ఇలా ఒక్కొక్కరిలో ఒక విధముగా బయట పడే అవకాశం ఉన్నా సమస్య లూపస్.

ఈ సమస్య వచ్చిన వారిని తాకితే ఇంకొకరికి వ్యాపించదు, వారసత్వంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండును, లేదా, శరీరంలో రోగ నిరోధక శక్తి వ్యవస్తా పనిచేయకపోవడంతో లక్షణాలు బయట పడును.

శరీరంలో సాధారణంగా వచ్చే సమస్యల ఉండడంతో దగ్గరలోనే ఆస్పత్రికి వెళ్లి సాధారణ వైద్యం చేయించుకొని వెళ్లి పోవడం జరుగుతుంది, సమస్య పూర్తిగా తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్తూ వస్తూ ఉంటారు,

కొన్ని ప్రత్యేకమైన పరీక్షల ద్వార మాత్రమే వ్యాధి నిర్ధారణ జరుగును రక్తం, మూత్రం, బోన్ మ్యరో తో మాత్రమే ఈ యొక్క లూపస్ వ్యాధి బయటపడుతుంది.

లూపస్ సమస్య గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే (ఉదాహరణకు) మన దేశ ఆర్మీ సైనికులు బార్డర్ లో కాపలా కాస్తూ మన దేశాన్ని కాపాడు తుంటారు, పక్క దేశం వారు మన దేశం పైన దాడి చేస్తే ఎదురు దాడి చేస్తారు,సిస్టమాటిక్ లూపస్ విషయానికొస్తే, మన దేశన్ని కాపాడే ఆర్మీ సైనికులు మన దేశం పైననే దాడి చేస్తే జరిగే నష్టం ఏ విధంగా ఉంటుందో, సిస్టమాటిక్ లూపస్ వలన బయటనుండి క్రిమికీటకాలు శరీరంలోనికి వచ్చినట్లయితే చంపే రక్షణ వలయం ప్రతి శరీరనికి ఉంటుంది, క్రిమికీటకాలు ఏమి రాకపోయినా మన శరీరంలో ఉన్న రక్షణ వలయం మన శరీరం పైన దాడి చేస్తే కలిగే నష్టమే ఈ యొక్క సిస్టమేటిక్ లూపర్స్,

సిస్టమేటిక్ లూపాస్ సమస్య అతి తక్కువ మంది వైద్యులకు మాత్రమే అవగాహన ఉండడంతో ఈ సమస్య లక్షణాలతో వైద్యానికి వచ్చేవారిని గుర్తించక పోవడం గమనార్హం,

ప్రభుత్వం ఈ యొక్క సమస్యను ప్రత్యేకంగా గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్లను ఏర్పాటు చేయవలసినదిగా, తెల్ల రేషన్ కార్డు తో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పూర్తి ఉచితంగా చేసే విధంగా ఏర్పాటు చేయాలని ఈ సమస్యతో బాధపడే ప్రజలందరికీ తరపున ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది.

ఈ యొక్క సమస్యకు నిమ్స్ హాస్పటల్ నందు వైద్యం కలదు, ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు డ్యూటీ ల వారీగా మారుతున్నందున, సమస్యతో బాధపడే ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో స్థిరంగా ఉండే వైద్యుడి వద్దకు సమస్య పరిష్కారం కొరకు జీవితకాలం తిరగవలసి ఉన్నందున ఖర్చుతో కూడిన సమస్య లూపస్ అవ్వడం తో ప్రభుత్వం పేద ప్రజల పైన జాలి చూపి రేషన్ కార్డ్ వెంట తీసుకొని వెళితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేసే విధంగా లూపర్స్ అనే సమస్యను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నారు ప్రజలు.

లూపస్ అనే సమస్య కు స్టెరాయిడ్స్ కూడా ఉండడంతో ఈ సమస్యతో బాధపడే వారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, సమస్య వచ్చిన వారు మనోధైర్యాన్ని కోల్పోకుండా వైద్యుని సలహా లతో మందులు వాడుతూ, సన్ లోషన్ వాడుతు, వ్యాయామాలు, యోగా, వంటివి చేస్తూ, ఎండలో తిరక్కుండా, చికెన్, మటన్ తక్కువగా తీసుకుంటూ, చేపలు ఎక్కువగా తింటూ, ప్రోటీన్స్, సి విటమిన్ తో కూడిన ఆహారం తీసుకుంటూ జీవించాలని ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం.

ఇండ్ల మహేష్, జనం సాక్షి ఫోటోగ్రాఫర్
మహబూబాబాద్ 9885942502