వచ్చే ఎన్నికలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పండివచ్చే ఎన్నికలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పండి

డిసిసి అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి
మల్దకల్  ఫిబ్రవరి 17 (జనం సాక్షి)కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు గద్వాల్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హత్ సే హత్ జొడో అభియాన్ కార్యక్రమం శుక్రవారంమద్దెలబండ, మద్దెలబండ పెద్దతండా, చిన్నతండలో జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి మధ్యతరగతి ప్రజలకి పేద ప్రజలకి మోసం చేస్తున్నారని, నిత్యవసరాలు ఆకాశానికి పెరిగాయి గ్యాస్ ధర 1200 చేశారని డీజిల్ పెట్రోల్ ధరలు కూడా చాలా రేట్లు పెంచారు, దీని భారం ప్రజల మీద పడి ప్రజల ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా తయారైతున్నాయి అని చెప్పారు.ఈ కార్యక్రమంలో పిసిసి ప్రతినిధి మాజీ మున్సిపల్ చైర్మన్ శంకర్ మాట్లాడుతూకేంద్రంలో మోడీ రాష్ట్రంలో కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు,మోడీ అధికారంలో వస్తే నల్లధనం బయటికి తెచ్చి ప్రతి అకౌంట్ కి పేద ప్రజలకి 15 లక్షలు ఇస్తా అని చెప్పారు,కెసిఆర్ కూడా దళితులకి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి తానే ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు,మరోసారి దళిత బంధువు అని సొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చి దళితులకు మోసం చేశాడు కేసీఆర్ అని చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బల్గేరా నారాయణరెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వాల్మీకులకి ద్రోహం చేసినది 9 సంవత్సరాలలో రెండుసార్లు ఓట్ల కోసం వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్పిస్తానని చేర్పించలేదు.మరోసారి వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్పిస్తా అని అసెంబ్లీలో తీర్మానం చేసి పది,పన్నెండు కులాలని కలిపి కేంద్రానికి పంపారు.కేంద్రం ఎలా చేయదు అనే నమ్మకంతోనే ఈ పని చేశారు అందుకోసమే మరోసారి వాల్మీకులు మోసపోకూడదు ఈసారి కెసిఆర్ కి బుద్ధి చెప్పాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమాల్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్,జిల్లా మైనార్టీ అధ్యక్షులు కిగాయత్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ అలెగ్జాండర్,జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాజీద్ ,మండల అధ్యక్షులు వెంకటేష్, గట్టు మండల అధ్యక్షులు రవి నాయుడు,వెంకటేష్ నాయక్, మురళి,శివనాయక్,నిల్య నాయక్,నరసింహ నాయక్, మైనుద్దీన్,మోష,హజి,వెంకటేష్,నాయకులు పాల్గొన్నారు.