వచ్చే ఎన్నికల్లో గెలవమని బిజెపికి కూడా తెలుసు: రాహుల్‌

న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేది లేదని బీజేపీ, ఆరెస్సెస్‌లకు బాగా తెలుసునని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం మిజోరాంలోని చంపాయ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. /ూష్ట్ర సంస్కృతిని ధ్వంసం చేయడానికి బీజేపీ (భారతీయ జనతా పార్టీ), ఆరెస్సెస్‌ (రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఘ్‌) ప్రయత్నిస్తున్నాయన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలవబోమని వాటికి బాగా తెలుసునని చెప్పారు. మిజోరాంలో ప్రవేశించి, దాని సంస్కృతిని నాశనం చేయడానికి ఇదొక్కటే అవకాశమని వాటికి అర్థమైందన్నారు. 40 శాసన సభ నియోజకవర్గాలు ఉన్న మిజోరాంలో ఈ నెల 28న పోలింగ్‌ జరుగుతుంది, డిసెంబరు 11న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ రాష్ట్ర సంస్కృతిని నాశనం చేయడానికి వాళ్లు ఈ ఎన్నికలను ఏకైక అవకాశంగా భావిస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష మిజో నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ భాజపాతో పెత్తుపెట్టుకోబోతోందని రాహుల్‌ ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత వీళ్లు చేతులు కలుపుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో మిజోరం ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందిందని, ప్రజల ఆదాయం పెరిగిందని రాహుల్‌ వెల్లడించారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే వచ్చే ఏడాదికి 11వేల ఉద్యోగాలు సృష్టిస్తామని, తూర్పు భారతదేశంలో మిజోరంను గేట్‌వే హబ్‌గా మార్చుతామని హావిూ ఇచ్చారు. సభలో రాహుల్‌ రఫేల్‌ ఒప్పందంపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అనిల్‌ అంబానీకి మ్గు//-ఫ వేల కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు, సీబీఐ, ఎన్నికల కమిషన్‌ పనుల్లో జోక్యం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. గవర్నర్లు, వైస్‌ఛాన్సలర్లు కావాలంటే ఆరెస్సెస్‌ నేతలైతే సరిపోతుందని చెప్పారు.