వన్డే టీమ్‌ నుంచి కల్లిస్‌ రెస్ట్‌ కొత్తగా ఆల్‌రౌండర్‌ డీన్‌ ఎల్గర్‌కు చోటు

జోహనస్‌ బర్గ్‌: ఇంగ్లాడ్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరిస్‌ కోసం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్‌ కల్లిస్‌కు విశ్రాంతినిచ్చారు. సెప్టెంబర్‌లో ట్వంటీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. 15 మందితో సౌతఫ్రికా సెలక్టర్లు ప్రకటించిన జాబితాలో కొత్తగా ఆల్‌రౌండర్‌ డీన్‌ ఎల్గర్‌కు చోటు కల్పించారు. ఈ ఏడాడి జనవరిలో శ్రీలంక పర్యటను ఎల్గారు ఎంపికైన్నట్టు కండరాలు పట్టేయడంతో ఆడలేకపోయారు. ఇంగ్లాండ్‌తో సిరిస్‌తో అతని అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంగ్రేటం జరిగే అవకాశముంది. అలాగే 2011 ప్రపంచకప్‌ తర్తా జాతీయ వన్డే జట్టుకు దూరమైన స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌కు సెలెక్టర్లు పిలుపినిచ్చారు. అతనతోపాటు ఫాస్ట్‌ బౌలర్‌ ర్యాన్‌ మెక్‌ లారెన్‌ కూడా ఎంపికయ్యాడు. 2010లో 10 వన్డేలు ఆడిన మెక్‌లారెన్‌ మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. ఇక బ్యాట్‌మెన్‌ వేన్‌ పార్నెల్‌ తన చోటు నిలపుకున్నాడు. ఐపీఎల్‌ ఊదు సీజన్‌ సందర్భంగా జరిగిన రేవ్‌ పార్టీల డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ సౌతాఫ్రికా బోర్డు అతన్ని ఎంపిక చేయడం విశేషం ఇదిలా ఉంటే ఇంగ్లాండ్‌తో వన్డే సిరిస్‌కు ముందు పార్నెల్‌ డుప్లెసిస్‌, జస్టిస్‌ ఒన్‌టాంగ్‌ ఎల్గర్‌, మెక్‌లారెన్‌ ఐర్లాండ్‌ టూర్‌కు వెళ్లనున్నారు. సౌతాఫ్రికా ఏజట్టు తరపున అక్కడ నాలుగురోజులు మ్యాచ్‌తో పాటు ఒక అనధికార వన్డే ఆడనున్నారు. ఇది ముగిసిన వెంటనే నేరుగా వచ్చి జట్టుతో కలుస్తారని దక్షిణాఫ్రికా బోర్డు వర్గాలు తెలిపాయి. వన్డే సిరిస్‌ తర్వాత జరిగే టి ట్వంటీలకు వరల్డ్‌ కప్‌కు దక్షిణాఫ్రికా జట్టును ఆగస్టులో ప్రకటించనున్నారు. ఇంగ్లాడ్‌ దక్షిణాఫ్రికా మధ్య ఐదు వన్డేల సిరిస్‌ ఆగస్ట్‌ 24 నుంచి ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు సఫారి టీమ్‌తో మరో రెండు టెస్టులు ఆడనుంది.
దక్షినాఫ్రికా టీమ్‌
ఎబీ డివిలియర్స్‌ హసిమ్‌, ఆమ్లా, జేపీ డుమ్నీ, డుప్లెసిస్‌, డీవ్‌, ఎల్గర్‌, ఇమ్రాన్‌తహీర్‌, ర్యాన్‌ మెక్‌లారెన్‌, మోర్కెల్‌, మోర్కెల్‌, జస్టిస్‌ ఒన్‌టాంగ్‌, వేన్‌ పార్నెల్‌, రాబిన్‌, పిటర్సన్‌, ్నగేమ్‌ స్మిత్‌, డేలే స్టెయిన్‌ తొత్పేటే.

తాజావార్తలు