వయలార్‌ రవితో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి వయలార్‌ రవితో తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె. చంద్రశేశఖరావు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై మరోమారు విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం . తెలంగాణ రాజకీయ ఈ నెల 30న కవాతు నిర్వహించనున్న నేపథ్యంలో వయలార్‌ రవితో కేసీఆర్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కవాతు నిర్వహణ తేదీలోపే తెలంగాణపై తన నిర్ణయాన్ని ప్రకటించాలని వయలార్‌ రవిని కోరే అవకాశం ఉంది.