వరంగల్లో నేడు క్రీడా దినోత్సవం విజయవంతం చేయండి

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 28(జనం సాక్షి)
 వరంగల్, హన్మకొండ జిల్లా మెడికల్ అసోసియేషన్.. వరంగల్ నగరంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ క్రీడా దినోత్సవం విజయవంతం చేయాలని కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు, క్రీడ అభిమాని మీరుపెళ్లి కమలాకర్ కోరారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డిసిపి పుష్పా రెడ్డి, టాస్క్ ఫోర్స్ అధికారి గైక్వాడ్, అలాగే స్పోర్ట్స్ అధికారి అశోక్, ఇందిరా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు
ఈ సందర్భంగా భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటిన అరుదైన జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు క్రీడా శిక్షకులువారిలో ప్రధానంగా పీవీ సింధు గారి అథ్లెటిక్ కోచ్ అయిన భారత ప్రభుత్వ అత్యంత శ్రేష్టమైన ద్రోణాచార్య అవార్డు గ్రహీత మన వరంగల్ వాస్తవ్యులు శ్రీ నాగపురి రమేష్ నేషనల్ అథ్లెటిక్ కోచ్ మరియు భారతదేశ హాకీ టీం కోచ్  దినకరన్
అలాగే భారత దేశ త్రివర్ణ పతాకాన్ని  ప్రపంచ దేశాల్లో విజయవంతంగా ఎగురవేసి పథకాలు సాధించిన భారత దేశ వాలీబాల్ జట్టు కెప్టెన్లు …వెంకట నారాయణపాలడుగు వెంకటేశ్వరరావు
అలాగే ఒలింపిక్ చరిత్రలో అద్భుతమైన మెడల్ని సాధించి భారతదేశానికి ఖ్యాతిని పెంచిన వరంగల్ వాస్తవ్యురాలు ఆర్చరీ ప్రణీత …..
ఇలాగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రీడాకారులు …
వారి శిక్షకులు ….
క్రీడల ద్వారా ఉపాధి పొంది ఉన్నతమైన పదవుల్లో భారత దేశంలో కొనసాగుతున్న
గొప్ప వ్యక్తులు అందరూ హాజరు అవుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమానికి ప్రతి ఒక్క కెమిస్ట్
కుటుంబ సమేతంగా పిల్లలతో హాజరై క్రీడల ప్రాముఖ్యత క్రీడల వల్ల మన పిల్లల భవిష్యత్తుకు జరిగే ఉపయోగాలు క్రీడలు మనిషి దైనందిన జీవితంలో ఎటువంటి మేలును కలిగిస్తాయని కమలాకర్ పేర్కొన్నారు
ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై క్రీడల ద్వారా వారికి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా భావించి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరు కావడం అత్యంత ఆవశ్యకంఅని తెలిపారు