వరంగల్ కోటలో హెరిటేజ్ వాక్
వరంగల్,ఆగస్ట్4(జనం సాక్షి): చారిత్రక కాకతీయుల కట్టడాలు కలిగిన ఖిల్లా వరంగల్ ప్రాంతంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పురాతన కట్టడాల సందర్శనలో భాగంగా చేపట్టిన హెరిటేజ్‌వాక్‌ను మహానగర పాలక సంస్థ కమిషనర్ గౌతమ్ జెండా ఊపి ప్రారంభించారు. పడమర కోట ద్వారం నుంచి ప్రారంభమైన వాక్ మధ్య కోట కళాతోరణాల వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.