వరంగల్ పార్లమెంట్ స్థానిక దళితులకే ప్రాధాన్యతనివ్వాలి

 

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 11 (జనం సాక్షి)

భారతీయ జనతా పార్టీలో 30 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు దళితులకు సంబంధించి రెండు అసెంబ్లీ, ఒకటి పార్లమెంటు సీట్లు కలవు
ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి పార్టీలో ఉన్న నాయకులను మరిచి బయట నుండి వచ్చే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బయట నుండి వచ్చినవారు పోటీ చేస్తున్నారు ఓడిపోయిన తర్వాత కనుమరుగు అవుతున్నారు. దయచేసి ఇప్పటికైనా పార్టీని నమ్ముకుని కట్టుబడి ఉన్న కార్యకర్తలను గుర్తించి స్థానిక నాయకులకు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులుగా గుర్తించి స్థానికులైన వారికి టికెట్ కేటాయించగలరని
జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎన్నికల సహ ఇంచార్జ్ గౌ “సునీల్ బన్సల్ గారిని హనుమకొండ పార్టీ ఆఫీసులో కలసి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ,ఓబిసి జాతీయ మెంబర్, ఎక్స్ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన.వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎస్సీ మోర్చా నాయకులు.జిల్లా అధికార ప్రతినిధి పోలేపాక మార్టిన్ లూథర్ గారు .ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదాసు రాజు గారు