వరంగల్ సభ కు తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు.
తొర్రూర్ 27 ఆగస్టు (జనంసాక్షి )
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర-మూడో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈరోజు వరంగల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కు తొర్రూరు మండలం నుండి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది.బీజేపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య జెండాను ఊపి వాహనాలు ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్ ఎన్ని కుట్రలు పన్నినా అడ్డంకులు సృష్టించినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతం అయింది అని తెలిపారు.ప్రజాస్వామ్య యుతంగా రాజ్యాంగ బద్ధంగా బండి సంజయ్ గారు చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ప్రజల్లో చైతన్యం నింపింది అని తెలిపారు.ప్రజల స్పందన ను ఓర్వలేక కేసీఆర్ సర్కారు నియంత్రృత్వ అహంకార ధోరణి తో అనేక ఇబ్బందులు పెట్టినా న్యాయ స్థానం మొట్టికాయలు వేసింది అని తెలిపారు.రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో పేదల ప్రభుత్వం రాబోతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్,రూరల్ మండలం అధ్యక్షుడు బొచ్చు సురేష్, జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి,15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్, జిల్లా నాయకులు కస్తూరి పులేందర్,పూసాల శ్రీమాన్, మంగళపళ్ళి యాకయ్య, పైండ్ల రాజేష్, రాయపురం రాజకుమార్, కాగు నవీన్,కొండ యాకన్న, కొమ్ము రాము,నూకల నవీన్,రవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు