వరదలతో మంథని ప్రాంతం మునిగి పోతే ఎందుకు రాలేదు..?
-సీఎం ఇప్పుడు ఎందుకు వస్తున్నారు..?
– విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి
మంథని, ఆగస్టు 28 (జనంసాక్షి):
మంథనిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి మునిగిపోయిన రాలేని ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ఎం మొహం పెట్టుకొని పెద్దపల్లి కి వస్తున్నారు, వరదలతో మంథని ప్రాంతం మునిగి మేము తీవ్రంగా నష్టపోతే ఎందుకు రాలేదు, భద్రాచలం లో ఇంటికి పది వేలు ఇచ్చినట్టు మంథని ప్రాంతంలో కూడా నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను కోరిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు, ఇక మీదట మంథని ప్రాంతానికి వస్తే కచ్చితంగా బీజేపీ పార్టీ పక్షాన అడ్డుకుంటాం,
పంజాబ్ రాష్ట్ర లో రైతులకు మూడు లక్షల రూపాయలు ఇచ్చిన నీకు తెలంగాణ ప్రాంతంలో నష్టం పోయిన రైతులు కనిపించడం లేదా?
రైతు రుణమాఫీ ఎందుకు చేయడం లేదు, ఇతర రాష్ట్రలల నుండి రైతు అధ్యక్షులను పిలిచి విందులు, వినోదలు ఏర్పాటు చేసి కెసిఆర్ నీవు సాధించింది ఏమిటి?
ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతులని పిలిచి ఎందుకు మాట్లాడావ్,
శాంతియుతంగా ఉన్న హైదరాబాద్ లో అలజడి కి కారణం కేటీర్ కదా, మునావర్ పరూఖి ని హైదరాబాద్ కి పిలుచుకొని రెడ్ కార్పేట్ వేసింది కేటీర్,
చాల రాష్టాలలో మునవర్ పరుఖి షోలకి అనుమతి లేదు, హిందూ దేవతలపై జోక్ లు వేసే షో లకి అనుమతి ఇస్తారా?
హిందువులను చంపుతాం అన్న నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు,
కెసిఆర్ కూతురు కవిత మీద వస్తున్న అవినీతి ఆరోపణలు నుండి జనాల దృష్టి మల్లించడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని,
నిన్నటి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సభ విజయవంతం చేసిన ప్రతి ఒకరికి ధన్యవాదములు తెలిపారు..
కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజు, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్ పట్టణ ప్రధాన కార్యదర్శులు సబ్బని సంతోష్, పబ్బ తిరుపతి, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బోయిని నారాయణ, సీనియర్ నాయకులు నాంపల్లి రమేష్, రాపర్తి సంతోష్, వేల్పుల సత్యం, అయింటి మల్లేష్, పట్టణ కార్యదర్శి ఎడ్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు.