వరప్రదాయని సీఎం రిలీఫ్ ఫండ్

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
శివ్వంపేట జూలై 19 జనంసాక్షి :ఎందరో అభా గ్యుల పాలిట ముఖ్యమంత్రి సహాయనిధి వర ప్రధానిలా మారిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని దంతాన్ పల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ నాగేశ్వర్ రావుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 40 వేల రూపాయల చెక్కును మంగళవారం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకట్ రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్ లు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎందరో పేద ప్రజలకు సహాయం చేస్తున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి అనిర్వచనీయమైనది ఆయన అభాగ్యుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతూ వారికి తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు నాయకులు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.



