వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్‌

నెల్లూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): నెల్లూరు నగరంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళా  నేరస్థులను చిన్నబజారు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అడిషినల్‌ ఎస్పీ అడ్మిన్‌ వన్‌ పరమేశ్వరరెడ్డి మరియు అడిషనల్‌ ఎస్పీ కైమ్ర్‌ ఆంజనేయులు ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్‌ డీఎస్పీ మురళీకృష్ణ  ఆధ్వర్యంలో చిన్నబజారు సిఐ అబ్దుల్‌ సుభాన్‌ ఎస్సై కరిముల్లా వారి సిబ్బంది కేసును త్వరితగతిన ఛేదించారు. పోలీసుల వివరాల మేరకు … గోనూరు కాశమ్మ సాయినగర్‌ కొత్తూరు, వైఎస్‌ఆర్‌ నగర్‌ నెల్లూరు తాండం పోచమ్మ డ్రైవర్స్‌ కాలనీ, బండి గౌరీ గోకవరం గ్రామం గోకవరం వరం మండలం తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. వీరు నెల్లూరు నగరంలోని రద్దీగా ఉన్న ప్రాంతాలే టార్గెట్‌ చేస్తారు. ఆత్మకూరు బస్టాండ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, మనుముడి బస్టాండ్‌, షాపింగ్‌ మాల్స్‌ ఎంచుకుని మహిళలను మాయమాటలలో పెట్టి వారి వద్ద ఉన్న బంగారు వస్తువులను దోచుకెళ్ళేవారు. వీరిపై పలు స్టేషన్లలో కేసులున్నాయి. ఈ నేపథ్యంలో నేరస్తుల వద్ద నుండి తెలుపు రంగు రాళ్ల నెక్లెస్‌, ఐదు సవర్లు గొలుసు, ఐదు సవర్ల నల్లపూసల దండ, నాలుగు సవర్ల సాదా స్సై నగరనార్‌ సౌర, ఒక జత కమ్మలు, నాలుగు గ్రాముల కాల్‌ సౌర కొక్క ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. వీరిని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నేరస్తులను అరెస్టు చేసినందుకు చిన్నబజార్‌ సిఐ అబ్దుల్‌ సుభాన్‌, ఎస్సై కారిముళాను పోలీసు ఉన్నత అధికారులు అభినందించారు.

తాజావార్తలు