వర్గీకరణను చేయని బిజెపి పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేద్దాం

 

 

 

 

-ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న.
గద్వాల నడిగడ్డ ,మార్చి 7 (జనం సాక్షి):
మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి యేరమొని యాదగిరి అధ్వర్యంలో నడుస్తున్నా మాదిగల సంగ్రామ పాదయాత్ర ను 3 వ రోజు మంగళవారము జోగులాంబ గద్వాల జిల్లా
వడ్డేపల్లి మండల కేంద్రములో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ను ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల బీమన్న మాదిగ ప్రారంభించారు.అంతరం ఆయన మాట్లాడుతూ
వర్గీకరణ చేస్తారని మాట ఇచ్చి తప్పినందుకు బిజెపి ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకోవడానికి ఏప్రిల్ 3 న బిజెపి రాష్ట్ర కార్యాలయం ముట్టడి, 4 న రాష్ట్ర రాజధాని ముట్టడి కార్యక్రమాలు జయప్రదం చేయుటకు మాదిగల సంగ్రామ పాదయాత్ర చేపడుతున్నామని ,సంగ్రామ పాదయాత్ర లో ఎం ఎస్ పి
రాష్ట్ర నాయకులు కొమ్మవారి మస్తాన్ మాదిగ, జిల్లా ఇంఛార్జి ఐజా రాజు మాదిగ,. జిల్లా నాయకులు జయరాజు.
ఆంజనేయులు.శ్రీను,కృష్ణా కాంత్,యోసేపు, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.