వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ఆమోదించాలి

స్టేషన్ ఘనపూర్ , జూలై   , ( జనం సాక్షి ):
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి 8 వ రోజు దీక్షలు మండల ప్రధాన కార్య దర్శి గాదె శ్రీధర్ మాదిగ అధ్యక్షతనకొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే వర్షా కాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించాలని, మాదిగల న్యాయమైన డిమాండ్లనుతక్షణమే పరిష్కరించాలని అన్నారు. మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేని పక్షంలో పోరాటాలు ఉధృతంగా ఉంటాయని,మా గ్రామాలకు బిజెపి నాయకులను రాకుండా అడ్డు కుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజ కవర్గ కోకన్వీనర్ మంద శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్ పి మండల అధ్యక్షుడు ఆరూరి శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు గాదె రాములు మాదిగ,తెలంగాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకు డు మంద సొమ్ములు, మండల్ ఇన్చార్జ్ చాడ ఏలి యా మాదిగ, మండల నాయకులు గుర్రం నవీన్, గాది కుమార్, గాదె ప్రభాకర్, గుండె యాదగిరి, దీక్షలకు  టిఆర్ఎస్ నాయకులు చింత జోసఫ్ సింగపురం బాబు తదితరులు సంఘీభావం తెలి పారు.ఈ రోజు దీక్ష శిబిరాన్ని బిఎస్పి జిల్లా అధ్య క్షుడు తాళ్లపల్లి వెంకట స్వామి సందర్శించి దీక్షను విరమింపజేశారు.