వాజ్‌ పేయి వైద్య ఖర్చులు లెక్క చెప్పండి

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహరీ వాజ్‌పేయి వైద్య సేవలకు అయిన మొత్తం ఖర్చు 15 రోజుల్లోగా వెల్లడించాలని జాతీయ సమాచార కమిషన్‌ ఆరోగ్యశాఖను ఆదేశించింది. సమాదచార హక్కు చట్టం ద్వారా మొరదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వాజ్‌పేయి వైద్య సేవలకు అయిన ఖర్చు వివరాలు తెలపాలని దరఖాస్తు దాఖలు చేశారు. మాజీ ప్రధానమంత్రికి సంబందించి వైద్య సేవల ఖర్చుల వివరాలు వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉంటాయని సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌ సత్యానంద మిశ్రా తెలిపారు. ఈ మేరకు దరఖాస్తును వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ  చేసినట్లు చెప్పారు. 1999 నుంచి 2004 మధ్య కాలంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకి మోకాలు చిప్ప మార్పిడి జరిగింది.