వారసత్వ రాజకీయాల గురించి .. పవన్‌కు మాట్లాడే అర్హతలేదు
– చంద్రబాబుపై కుట్రపూరితంగానే పవన్ ఆరోపణలు
– శ్రీకాకుళంలో వైసీపీ కిరాయి గుండాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి
– విలేకరుల సమావేశంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
విజయవాడ, అక్టోబర్17(జనంసాక్షి) : వారసత్వ రాజకీయాలని మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని, ఆయన వారసత్వం ద్వారానే సినిమాల్లోకి, రాజకీయాల్లోకి వచ్చాడని గుర్తుంచుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు..
వారసత్వం కారణంగానే పవన్ సినిమాల్లోకి వచ్చారన్నారు. పవన్ మొదటి సినిమా ఆయన బావ బేనర్‌పై చేయించారని అన్నారు. తన అన్న పెట్టిన ప్రజారాజ్యంలో పనిచేసిన తరువాతనే జనసేన పార్టీని ఏర్పాటు చేశారన్నారు. అలాంటి టీడీపీవి వారసత్వ రాజకీయాలు అంటూ పదేపదే మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇలాంటి మాటలు మాట్లేడే ముందు తనకు ఆ అర్హత ఉందా లేదా అని ఆలోచించుకోవాలని, తమలాంటి వాళ్లం వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది తప్ప, పవన్ లాంటి వారు మాట్లాడితే చెల్లుబాటు కాదని అన్నారు. మరోవైపు వైసీపీ-బీజేపీ-జనసేన మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ మూడు పార్టీలు చీకటి ముసుగులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ-బీజేపీ-జనసేన ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలని, అప్పుడు తమ బలమేంటో, వారి బలమేంటో తెలుస్తుందని బుద్దా వెంకన్న అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కిరాయిగూండాలు ప్రజలను రెచ్చగొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. జగన్ ప్రకటించిన రూ.50 లక్షల తుపాను సాయం ఎవరికి పంపారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి వచ్చిన కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ శ్రీకాకుళం వెళ్లకపోవడం దారుణమని అన్నారు. తితలీ తుపాన్‌తో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయితే.. రాష్టాన్రికి వచ్చిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించకపోవడం బాధకలిగించిందని అన్నారు.