వాళ్ల తరపున మేం వాదించం : న్యాయవాదుల తిరస్కారం
న్యూఢిల్లీ : విద్యార్థినిపై బస్సులో అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా హింసించి ఆమె మరణానికి కారకులైన ఆరుగురు వ్యక్తుల తరపున న్యాయస్థానంలో తాము వాదించబోమని ఢిల్లీ న్యాయవాదులు స్పష్టంచేశారు. సాకేత్ జిల్లా కోర్టులో రేపు విచారణ ప్రారంభం కావలసి వున్న ఈ కేసులో తాము వాదించవద్దని నిర్ణయించుకున్నట్లు సాకేత్ డిస్ట్రిక్ట్ బార్ కౌన్సిల్ సభ్యులు సంజయ్ కుమార్ తెలియజేశారు. తమ కౌన్సిల్‌లో ఉన్న 2,500 మంది న్యాయవాదులదీ ఇదే నిర్ణయమని ఆయన తెలియజేశారు.