వికెట్లు కోల్పోయిన భారత్
ఇంగ్లండ్‌తో విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. గంభీర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఓపెనర్ కేఎల్ రాహుల్.. బ్రాడ్ బౌలింగ్‌లో డకౌట్ కాగా.. మరో ఓపెనర్ విజయ్(20)ను అండర్సన్ పెవిలియన్‌కు పంపాడు. వీరిద్దరి క్యాచ్‌లను స్టోక్స్ పట్టడం విశేషం. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. పూజారా, కోహ్లి క్రీజులో ఉన్నారు.