విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విజయవంతం చేయండి..
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 26(జనం సాక్షి)
ఈనెల 28 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు కరీమాబాదులోని అంబేద్కర్ భవన్ వద్ద గౌతమ బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత రత్న బొమ్మల కట్టయ్య విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బొమ్మల అంబేద్కర్ శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. దళిత సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు బౌద్ధ అంబేద్కర్ సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు బొమ్మల అంబేద్కర్, ఎరకల మహేందర్,కడారి కుమార్, నీలం మల్లేశం,తరాల రాజమణి తదితరులు కోరారు. ఈ సమావేశంలో ఎరుకల కలవతి,జక్కుల రాజు, తరాల రవితేజ,మగ్గిడి సుధాకర్,రామ్లీల దేవేందర్, నీలం దామోదర్ ,బొమ్మల రాంప్రసాద్, ఒంటెల సురేష్ ,తరాల సారయ్య ,నాంపల్లి పెద్ద కుమారస్వామి,నాంపల్లి చిన్న కుమారస్వామి ,యనమల భిక్షపతి ,బొమ్మల్ల సిద్ధార్థ,రేషమల్ల వినోద్ ,జోడీముంతల రాజు తదితరులు పాల్గొన్నారు