విజేతలకు బహుమతుల ప్రధానం…

గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి
– డాక్టర్ దూళ్ల పరుశరాములు.
ఊరుకొండ, ఆగస్టు 16 (జనం సాక్షి):
స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్వతంత్ర దినోత్సవం రోజున రేవల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన జట్టుకు మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ దూళ్ల పరుశరాములు బహుమతులు ప్రధానం చేసినట్లు తెలిపారు. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామంలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి నియోజకవర్గ నాయకురాలు బాల త్రిపుర సుందరి ముఖ్యఅతిథిగా హాజరై వాలీబాల్ టోర్నమెంటులో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు షీల్డు తో పాటు నగదును బహుకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దూళ్ల పరుశరాములు మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి క్రీడలు నిర్వహించడం వలన యువకులలో ఐకమత్యంతోపాటు శారీరక దారుడ్యం, మానసిక ఉల్లాసం, ఏకాగ్రత పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు, మండలఅధ్యక్షుడు ఆంజనేయులు, రాజేందర్ గౌడ్, మల్లేష్, గ్రామ పెద్దలు, మండల నాయకులు, కార్యకర్తలు, క్రీడాభిమానులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.