విద్యారంగ సమస్యలపై నిర్లక్ష్యం తగదు
ఏటేటా సమస్యలు పెరగడమే తప్ప తగ్గడం లేదు
కార్పోరేట్ స్కూళ్లకు మేలుచేసేలా ప్రభుత్వం తీరు
నెలకావస్తున్నా పాఠ్యపుస్తకాలు అందడం లేదు
హైదరాబాద్,జూలై7(జనం సాక్షి): పాఠశాల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఏటేటా బందులు,ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని, ఎంఈవో పోస్టులను భర్తీ చేయడం విస్మరించిందంటున్నారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయాలని, మన ఊరు, మన బడిలో అన్ని పాఠశాలలను చేర్చి అభి వృద్ధికి పాటుపడాలన్నారు. జీవో నం. 42ను అమలు చేస్తూ పాఠశాలల అధిక ఫీజుల దోపిడి అరికట్టాల న్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాల నిర్వాహణ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న
ప్రభుత్వం కార్పోరేట్, ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాసే రీతిలో వ్యవ హరిస్తున్నదని మండిపడు తున్నాయి. ప్రభుత్వమే విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నదని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. విద్యాసంవ
త్సరం ప్రారంభమయి నెల రోజులు సవిూపిస్తున్నా, నేటికి ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదన్నారు. విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ జరగలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. వసతుల లేమి సౌకర్యాల కరువుతో విద్యార్థులు సతమతమవుతున్న పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ఉపాధ్యాయుల కొరత నేటికి తీరలేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యపు ధోరణి విడనాడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ మెరుగుదలకు తక్షణమే చర్యలు చేపట్టనున్నారు. లేని పక్షంలో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. మరోవైపు పాఠశాలలు పునఃప్రారంభమై మూడు వారాలు గడిచినప్పటికీ పాఠ్యపుస్తకాల జాడలేదు. ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా సర్కారు బడుల్లో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఓ వైపు ప్రభుత్వం చెబుతోంది. మరో వైపు సర్కారు బడుల్లో సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలలు తెరిచి మూడు వారాలు దాటినా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందలేదు. దీంతో బోధనకు ఆటంకం కలుగుతోంది. 50 శాతం పుస్తకాలే వచ్చాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పదో తరగతికి సంబంధించి గణితం, హిందీ, తొమ్మిదో తరగతికి సంబంధించి భౌతిక శాస్త్రం పుస్తకాలు ఇంతవరకు రాలేదు. 8వ తరగతికి సంబంధించి ఫిజిక్స్, సోషల్, బయాలజీ, ఏడో తరగతికి సంబంధించి మాథ్స్, సైన్స్, సోషల్, 6వ తరగతికి సంబంధించి ఇంగ్లీష్, సోషల్, సైన్స్, మాథ్స్ స్జబెక్టులు రాలేదు. అలాగే ఒకటి నుంచి ఐదో తరగతికి సంబంధించిన పుస్తకాలు పూర్తిగా వచ్చాయి. గతంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠ్య పుస్త కాలను సమ కూర్చేవారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక హెచ్‌ఎంలు వాటిని తీసుకువెళ్లి విద్యా ర్థులకు అందించేవారు. కాగా ప్రస్తుతం పుస్తకాలు సగం వరకే రావడం తో వచ్చిన వాటిని అయా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ విూడియం ప్రారం భించాం. దీంతో తెలుగు విూడియం విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను రెండు భాషలలో ముద్రిస్తోంది. అందుకే పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్నామని అధికారులు అంటున్నారు.