విద్యార్థులకు అవగాహన చట్టాలపై సదస్సు: నారాయణఖేడ్ మెజిస్ట్రేట్ జడ్జి ప్రియాంక

నాగలిగిద్ద జూలై 16 (జనంసాక్షి)

మండలం గుత్తి గ్రామ గురుకుల పాఠశాలలో శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నారాయణఖేడ్ మెజిస్ట్రేట్ ప్రియాంక మాట్లాడుతూ విద్యార్థులకు నేటి తరంలో జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు దొంగతనాలు బాల్యవివాహాలు బాలికల పైన అఘాయిత్యాలు గృహహింస జరుగుతున్న తరుణంలో వాటిపైన విద్యార్థులకు పాఠ్యపుస్తకంలోని ఒక సబ్జెక్టు మాదిరిగా వివరణ ఇచ్చారు ,ఒకప్పటి కలికాలంలో ఆడపిల్లలకి భద్రత లేకుండా పోవడం కానీ నేటి తరంలో ఆడపిల్లలకి ఉన్నంత భరోసా ఇవ్వడం జరుగుతుంది. షీ టీమ్స్ లాంటివి ఏర్పాటు చేశారు,ఆడపిల్లలకి కూడా అత్యంత పై చదువులు చదివించాలని విద్య యొక్క ప్రాముఖ్యత పై అవగాహన కల్పించడం జరిగింది ఈ ప్రోగ్రాం లో కనీసం విజయరావు ,అడ్వకేట్ భోజిరెడ్డి ,జీవన్ ,రాజు, మరియు పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు