విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 08(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని పోచం మైదాన్ ఎస్సార్ మహిళ జూనియర్ కళాశాల విద్యార్థులకు గురువారం వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపొద్దని, త్రిబుల్ రైడింగ్ చేయొద్దని లైసెన్స్ తప్పకుండా ఉండాలని వివరించారు. అలాగే హెల్మెట్ కూడా ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్, ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area