విద్యాహక్కు చట్టానికి తూట్లు

కర్నూలు,నవంబర్‌ 22(:పేద, మధ్య తరగతి ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో 25శాతం ఉచితంగా విద్య అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతున్నా ఏ ఒక్క ప్రైవేటు- పాఠశాలలోగాని, కార్పొరేట్‌ సంస్థల్లో గాని ఇది అమలు కావడం లేదు. ప్రతి పాఠశాలలో ఫీజుల వసూళ్ల పట్టికను బయట ప్రదర్శించాలి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు డీఎడ్‌ లేదా అందుకు సమాన అర్హత ఉన్న ఉపాధ్యాయులను నియమించాలి. 6నుంచి 8వ తరగతి వరకు డిగ్రీ, బీఈడీ సమానమైన అర్హత ఉన్న ఉపాధ్యాయులు బోధించాలి. అయితే జిల్లాలోని పలు పాఠశాలల్లో ఇవేవీ అమలు కావడం లేదు. విద్యాధికారుల ఉదాసీనత, ప్రైవేట్‌ యాజమాన్యాల ధనదాహం కలిసి విద్యాహక్కు చట్టానికి తూట్లు- పొడుస్తున్నాయి. ఆరేళ్ల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలందరికీ విద్యావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంది. అయితే ఫీజులు, బోధనకు సంబంధించిన నిబంధనలను విద్యా సంస్థలు పాటించడం లేదు. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులచే ఎన్నుకున్న గవర్నరింగ్‌బాడీలు ఫీజులను నిర్ణయించాలి. కానీ కార్పొరేట్‌, ప్రైవేటు- విద్యా సంస్థలు తమకు అనుకూలమైన వారి పేర్లను గవర్నరింగ్‌ బాడీలో చేర్చుకొని తమకు ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారు.పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం క నీసంగా అముల కాకపోయినా జిల్లా, మండల, డివిజన్‌ విద్యాశాఖ అధికారులు పట్టనట్టు- వ్యవహరిస్తున్నారు.