విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
జూలై 16, జనం సాక్షి.వర్షాకాలం దృష్యా కరెంట్ సరఫరాలో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయని, అధికారులు ముందు చూపుతో సమస్యాత్మకంగా ఉన్న వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించాలని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎంపీ కార్యాలయంలో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు పనిచేయాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. వర్షాల సమయంలో ఎలాంటి ఆపద జరగకుండా చూడాలన్నారు. విద్యుత్ అధికారులు అనుక్షణం అలెర్ట్ గా ఉండాలని, ప్రజల నుండి ఎలాంటి సమస్య వొచ్చినా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కార మార్గం చూడాలన్నారు. సమీక్షలో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల విద్యుత్ శాఖ ఏఈ వాసుదేవరావు, దౌల్తాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ లు శ్రీనివాస్ రావు, జనార్దన్ రెడ్డి, చిత్తరి గౌడ్, సొసైటీ వైస్ ఛైర్మన్ పాల రవీందర్ గౌడ్, నాయకులు మోహన్ రావు, రామచంద్రం, ఇప్ప దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area



