విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలి – ఎస్పీ శరత్ చంద్ర పవార్
డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 4 (జనం సాక్షి):
న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత అని ముందుగా చట్టాలను స్వయంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఎస్పి శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం సీరోల్ పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆనంతరం పోలీస్ సిబ్బంది నీట్ టర్న్ ఔట్,కిట్ ఆర్టికల్స్ పరిశీలించారు.అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్సై రమాదేవి ఎస్పీకి వివరించారు.పోలీస్ స్టేషన్ అవరణలో మొక్క నాటారు.అనంతరం అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రతి రోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని,
విధుల పట్ల అంకితభావంగా ఉండాలని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.పోలీస్ స్టేషన్ లోని వర్టికల్స్ నిర్వహణ,హెచ్ఆర్ఎంఎస్ ఆన్లైన్ వినియోగించు విధానమ ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయు మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు తనిఖీ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని, వారితో మర్యాద మెలుగలని సూచించారు. వాహనాల సంబందించిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కలిగి ఉండాలి అన్నారు. విధినిర్వహణలో ఉత్తమా ప్రతిభ కనబరిచిన వారికి రివార్డ్ ప్రకటించారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు డిఎస్పీ వెంకటేశ్వర బాబు,మరిపెడ సీఐ ఎల్.రాజు, సీరొలు ఎస్.ఐ రమాదేవి సీసీ చంద్రకాంత్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.