వినాయకునికి చెప్పన్ భోగ్ ప్రసాదం
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 8 తూప్రాన్ పట్టణంలోని వైశ్య భవనంలో ఏర్పాటు చేసిన వైశ్య సంఘ వినాయకుని వద్ద పట్టణ ఆర్య వైశ్య సంఘం మహిళల ఆర్యవైశ్య సంఘం ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకునికి చెప్పన్ భోగ్ ప్రసాదాన్ని సమర్పించారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొవ్వూరు శ్రీనివాస్ మహిళా సంఘం అధ్యక్షురాలు గబ్బుల సంతోష ఆర్యవైశ్య యూత్ అధ్యక్షులు దేవత శ్రవణ్ కుమార్ ల ఆధ్వర్యంలో చెప్పన్ భోగ్ వినాయకుని భక్తిశ్రద్ధలతో సమర్పించారు కార్యక్రమం కనుల పండుగగా జరిగింది వేద పండితులు ఉదయ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం భజన మంగళ హారతులు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోవూరి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పల్లెర్ల బా లే ష్ కోశాధికారి మాలే కుమార్ మండల ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు దేవత శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి నేతి సాగర్ ల ఆధ్వర్యంలో చిన్నారులకు ఆటలు పోటీల తో పాటు ప్రతిరోజూ నిత్య అన్నదాన కార్యక్రమం ఆర్యవైశ్య సంఘ సభ్యుల సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి