వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి..

• దౌల్తాబాద్ ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి
దౌల్తాబాద్, ఆగస్టు 30, జనం సాక్షి.
 వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని దౌల్తాబాద్ ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు సమావేశంలో వినాయక మండప నిర్వాహకులు వివిధ కుల సంఘాలు, యువజన సంఘ నాయకులు, ముస్లిం పెద్దలతో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ అధికారుల అనుమతులు తీసుకోవాలని, అదేవిధంగా విద్యుత్ అధికారుల నుంచి విద్యుత్ కోసం అనుమతులు తీసుకోవాలని మండపాల్లో డీజేలకు అనుమతి లేదని అన్నారు. మండప నిర్వాహకులు బలవంతంగా చందాలు వసూలు చేసిన చేయరాదని తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈనెల 31 నుంచి జరిగే ఉత్సవాల నిర్వాహనకు భక్తులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గణపతి ఊరేగింపులో కానీ చెరువుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కులమత
బేధాలు లేకుండా వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రజలు గణపతి మండప నిర్వాహకులు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సాయిలు, హేడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, కానిస్టేబుల్ దేవరాజు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.