వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ప్రదీప్ రావు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 11(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రంగసాయిపేట శ్రీ మహంకాళి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని నిమజ్జన ఊరేగింపులో శనివారం రాత్రి బిజెపి నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో పటు కొల్లూరు యోగానంద్ పాల్గొన్నారు. అంతకుముందు నాగపూర్ నుంచి వచ్చిన సుమారు 80 మంది కళాకారులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. స్థానిక ప్రజలు భక్తులు మహిళలు పెద్ద ఎత్తున వినాయకుని నిమజ్జనంలో పాల్గొని బెస్తాన్ చెరువు వరకు వెళ్లి వినాయక నిమజ్జనం చేశారు. అదేవిధంగా వినాయకుని లడ్డూ వేలం పాటలో దివ్య చికెన్ సెంటర్ యజమాని కొండ్రెడ్డి నవీన్ రెడ్డి 66, 116 వేలంపాడి లడ్డు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి యూత్ అసోసియేషన్ సభ్యులు కొండ్రెడ్డి నవీన్ రెడ్డి, కందగట్ల జీవన్ సిద్ధార్థ తివారి మహేష్, చిట్టి, ఈశ్వర్, ఆవునూరి రాజేష్ ,అవునూరి రాము, కందగట్లఅభిషేక్ ,గణేష్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు