వినియోగదారుల సంఘాల సమాఖ్య కోఆర్డినేటర్ గా పూర్ణచంద్రరావు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 25(జనం సాక్షి)
జాతీయ వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కోఆర్డినేటర్ గా వరంగల్ నగరానికి చెందిన తోట పూర్ణచందర్రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం తెలిపారు. వరంగల్ లోని శివ నగర్ లో జరిగిన సమావేశంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మొగిలిచర్ల సుదర్శన్ జాతీయ బాధ్యులుగా చేయడంతోపాటు తనకు రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి కల్పించడం జరిగిందని పూర్ణచంద్రరావు వివరించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఈ రోజు కల్తీ, మోసం అనేది అడుగడుగునా జరుగుతుందని ప్రజలకు వినియోగదారులను ఎలాంటి ఇబ్బందీ ఏర్పడిన తగిన ఆధారాలతో కలిసినట్టు అయితే కచ్చితమైన న్యాయం చేస్తానన్నారు. ఈ సందర్భంగారాష్ట్ర కోఆర్డినేటర్ తనకు అవకాశం కల్పించింనందుకు, గతంలో తాను చేసిన సేవలు గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినందుకు జాతీయ వినియోగదారుల కమిటీ పెద్దలకు పూర్ణచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు