విపక్షాలను ఏకం చేసిన ఘనత కెసిఆర్‌దే

 

రాష్ట్రంలో తెరాస ఎన్నికల ప్రచార సభలు ప్రభంజనంలా కొనసాగుతున్నాయి. కెసిఆర్‌ రోజుకు కనీసంగా ఐదు సభలతో అదరగొడుతున్నారు. సెంటిమెంట్‌ ఆయుధంగా ఆయన ప్రచారం సాగుతోంది. అయితే సెంటిమెంట్‌లో భాగంగా ఎపికి ప్రత్యేకమోదాపై గతంలో తాను చేసని ప్రకటనకు భిన్నంగా మాట్లాడుతున్న తీరు ఓ అగ్రనేతకు ఉండాల్సిన లక్షణం కాదు. విభజన చట్టంలో ఎపికి ప్రత్యేక¬దా అంశం ఉంది. దానిని ఇవ్వాలని గతంలో కెసిఆర్‌ స్వయంగా ప్రకటన చేశారు. అలాగే ఇప్పుడు మంత్రులు, ఎంపిలు దీనికి విరుద్దంగా మాట్లాడడం క్రెడిబిలిటీ కోల్పోవడం తప్ప మరోటి కాదు. ఇంకా విూరు వేరు..మేము వేరన్న ధోరణి కూడా సరికాదు.ఈ దేశంలో ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య విభేదాలు తొలగాలి. మనమంతా ఒక్కటే అన్న భావన ఉండాలి. ఈరకంగా నిజాయితీ రాజకీయాలు నడపాలి. ఇకపోతే కరెంట్‌ విషయంలో టిఆర్‌ఎస్‌ సాధించిన గొప్ప విషయంగానే చూడాలి. పొరపాటున మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు కిందా విూదా అవుతుందని, రాష్ట్రాన్ని దయ్యాలకు అప్పగించినట్లు అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎంతయినా ప్రచారం చేసుకోవచ్చు. ఎవరు చేసిన అభివృద్దిని వారు ప్రచారం చేసుకునే మక్కు ఉంది. ఇకపోతే సోనియా పర్యటన తరవాత గులాబీ పార్టీ నేతలు ఎందుకనో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇప్పుడు కెసిఆర్‌ కూడా అదే బాట పట్టారు. ఇలా చేయడం వల్ల సెంటిమెఉంట్‌ను మరోమారు బలంగా ప్రచారం చేసే ఉద్దేశం కావచ్చు. ఈ ఎన్నికలు ఓ రకంగా బలంగా రుద్దినవే. కాంగ్రెస్‌ వారి సవాల్‌కు అసెంబ్లీ రద్దు చేశానని మరోమారు కెసిఆ/- చెప్పడం సహేతుకంగా లేదు. తెలంగాణ రాజకీయ కురుక్షేత్రంలో తన ప్రత్యర్థులందరినీ ఒక్కటి అయ్యే అవకాశం విపక్షాలకు కెసిఆర్‌ ఇచ్చారు. ఇప్పుడు వారంతా ఏకం కావడంతో విజయం కోసం ఆయన పోరాటం చేయాల్సి వస్తోంది. ఎన్నికల నాడు ఉన్న ఊపు ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో లేదు. విజయం నల్లేరుపై నడక కాదన్న వాస్తవం తెలిసి వస్తోంది. ఇలాంటి చర్యలను సాహసంగా కేసీఆర్‌ భావిస్తూ ఉండవచ్చు గానీ అప్పుడప్పుడు అవి దుస్సాహ సంగా మారే ప్రమాదం కూడా ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా నాలుగున్నరేళ్లు పాలించిన కేసీఆర్‌ నిరంకుశ పాలన సాగించాడనడానికి కారణాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటానని ఇప్పటి వరకు కెసిఆర్‌ చెప్పడం లేదు. ప్రగతిభవన్‌ అందరికి అందుబాటులో ఉందని చెప్పగలిగే సాహసం చేయడం లేదు. ఉద్యమనే తలు ప్రజల్లో ఉండాలే తప్ప ప్రజలకు దూరంగా ఉండరాదు. అందుకే అంతా ఒక్కటై ఓడించడానికి రంగం సిద్దం చేసుకున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో గట్టి పోటీని ఎందుకు ఎదుర్కోవలసి వస్తున్నదంటే అందుకు కేసీఆర్‌ మాత్రమే కారణంగా చెప్పుకోవాలి. భిన్నదృవాలుగా ఉన్న కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలలను ఒక్కటి చేసే అవకాశం ఓ రకంగా కెసిఆర్‌ మాత్రమే ఇచ్చారు. కెసిఆర్‌ నిరంకుశ పాలనపై ఇప్పుడు ప్రతిచోటా చర్చ సాగుతోంది. ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలు నిరంకుశాన్ని సహించరు. ఎన్నో అవమానాలకు గురైన ఉద్యమకారులు కోదండరాం సహా అనేకులు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించడమనే ఏకైక ఎజెండాను తలకెత్తుకున్నారు. అదే ఇప్పుడు కెసిఆర్‌కు ప్రతిబంధకంగా తయారయ్యింది. అందుకే కెసిఆర్‌ సెంటిమెంట్‌తో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నా ప్రజల్లో అలాంటి సందర్భం కానరావడం లేదు. కాంగ్రెస్‌ వ్యతిరేకతే ప్రాతిపదికగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ మూడున్నర దశాబ్దాల తరువాత అదే కాంగ్రెస్‌తో జట్టు కడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కలవడాన్ని విమర్శించే వాళ్లు ఉంటే ఉండవచ్చు గానీ, మారిన, మారుతున్న రాజకీయాలలలో ఏదైనా జరగవచ్చని మోడీ, కెసిఆర్‌లు నిరూపించారు. వారి నిరంకుశం వారిని దహించి

వేసినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. వర్తమాన రాజకీయాలలో ఎవరెన్ని మంచి పనులు చేసినా ప్రజలను పట్టించుకోని విధానాలను ప్రజలు సహించరని ఇప్పటికీ కెసిఆర్‌ గుర్తించడం లేదు. అందుకే కేసీఆర్‌ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ పార్టీ అటు కోదండరాంకు, ఇటు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షం అయ్యింది. ఇకపోతే మజ్లిస్‌ మరీ భుజాలకు ఎత్తుకుంటున్న కెసిఆర్‌ వారి గత పాపాలను కూడా మోయాల్సి ఉంటుంది. సగటు ప్రజలకు ఇది జీర్ణించుకోలేని వ్యవహారం. కేవలం మైనార్టీ ఓట్ల కోసం ఇలాంటి ఎత్తులు బెడిసి కొడతాయని గుర్తించాలి. ప్రత్యర్థులందరూ ఏకమైనా మజ్లిస్‌ అండతో,మైనార్టీ ఓట్లతో ఎన్నికల్లో విజయం అందుకోవాలని భావిస్తున్నారు. కేసీఆర్‌తో అంటకాగిన అసదుద్దీన్‌ ఒవైసీ కూడా గతానికి భిన్నంగా టీఆర్‌ఎస్‌కు బహిరంగం గా మద్దతు ప్రకటించారు. ఇది కూడా బిజెపికి కలసి వచ్చే అంశం. తెలంగాణ విమోచనను పక్కన పెట్టడం, మజ్లిస్‌ను చంకనెత్తుకోవడం అన్నది ఓ రకంగా కెసిఆర్‌కు మైనస్‌ పాయింట్లుగానే బావించాలి. అందుకే రెండు నెలల క్రితం పార్టీ పరిస్థితికి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్న పరిస్థితికి మార్పు కనిపిస్తోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ మళ్లీ టికెట్లు ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గత ఎన్నికలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఫలితాలు టిఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా వచ్చాయి. అప్పుడు పరిస్థితి అంతా సెంటిమెంట్‌ ఆధారంగా సాగింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ ఫలిస్తుందనుకుంటే పొరబడక తప్పదు. పార్టీ అభ్యర్థులు ఎంత మంది గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలోనే టీఆర్‌ఎస్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి వారు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. దీనిని తక్కువ చేసి చూడడం లేదా, పోయిన వారిపై ఏదో ఒక ముద్దర వేయడం సహజమే అయినా ప్రజల్లో ఉన్న భావనలను మార్చలేరు.