విభజన హావిూలు కాంగ్రెస్‌కే సాధ్యం: డిసిసి

అనంతపురం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ  మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా, విభజన హావిూలు అమలు చేయగలదని ఆ పార్టీ పేర్కొంది. రైతులకు రుణమాఫీ, యువతకు ఉపాధి, జీఎస్టీ సరళీకరణ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రక్షణ సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు కోట సత్యం  స్పష్టం
చేశారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం ప్రత్యేక ¬దాపై, రెండో సంతకం రైతు రుణమాఫీ, మూడో సంతకం యువతకు ఉపాధిహావిూపై చేయించడం జరుగుతుందన్నారు. ఉత్తరాదిలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పాగా వేయబోతున్నదని అన్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పుడు రాహుల్‌ గాలి వీస్తోందన్నారు. మోడీ పాలనతో ప్రజలు విసిగి పోయారని అన్నారు.   పార్టీకి దూరమైన వారిని గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకు మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ధనికుల కోసమే పనిచేస్తోందనీ, సమాజంలో పేదల గోడు వారికి పట్టదని కాంగ్రెస్‌ పార్టీ నేత విమర్శించారు. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్దమయ్యారని అన్నారు. సమాజంలోని పేదలు, రైతులు, ఇతర బలహీనవర్గాలనూ పట్టించుకోవడంలో మోడీ విఫలమయ్యారని, ధనికులకు సంబంధించి రూ.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయగలిగినప్పుడు అదే తరహా లబ్దిని సమాజంలోని పేదలు, రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని  ప్రశ్నించారు. రైతులు, భూ యజమానులు నష్టపోకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంతో పాటు పంచాయితీరాజ్‌ వ్యవస్థను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఎపికి ప్రత్యేక¬దా కాంగ్రెస్‌కు మా/-తరమే సాధ్యమని అన్నారు.

తాజావార్తలు