విలేకరులు అక్రమ వసూళ్లు పై అధికారులకు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన యజమానులు

విలేకరులు అక్రమ వసూళ్లు పై అధికారులకు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన యజమానులు

 సికింద్రాబాద్  సెప్టెంబర్ 29 (జనం సాక్షి) ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలో పేద నిరుపేద కుటుంబాలకు చెందిన వేలాది  కుటుంబాలు నిరసిస్తున్నాయి,చిన్నా చితక ఉపాధితో బతుకు బండి ఇడుస్తూ సొంతింటి కలని నిజం చేసుకోవాలన్ని ఆలోచనతో అప్పుచేసి మరి ఇంటి కళనెరవేర్చుకుంటున్న  ఈ నేపథ్యంలో వివిధ దినపత్రికలు చెందిన (జనం సాక్షి కాదు ) నలుగురు వ్యక్తులు బోయినపల్లి డివిజన్ అంజయ్య నగర్ ప్రాంతంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.వీళ్లకు తోడు మరో ఇద్దరూ స్థానిక నేతలు,మరియు వీళ్లకు తొత్తులు,కూకట్ పల్లి మున్సిపల్ కార్యాలయానికి చెందిన విజయ్ కుమార్ అనే టౌన్ ప్లానింగ్ సిబ్బంది చైన్ మెన్ లింగం ఎక్కడ ఏ నిర్మాణం పురుడు పోసుకున్న ఈ సిబ్బంది సహాయ సహకారాల తో ఈ ప్రబుద్ధులుఅక్రమ వసూళ్లకు తెరలేపుతున్తున్నారు సమాజంలో ప్రజా సమస్యల ఎండ గట్టవలసిన విలేకరులే బక్క చిక్కన పేదలను పిండి డబ్బు వసూళ్లు చేస్తున్న ఈ పాత్రికేయుల పైన డివిజన్ పరిధిలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.ఏ ప్లాట్ ముందైనా ఇసుక,ఇట్టిక కనిపిస్తే గద్దల్ల  వాలిపోయి డబ్బులు ఇస్తే సరే లేక పోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామన్ని భయ భయభ్రాంతులను కు గురి చేస్తారు.
సెల్లార్,ఎక్స్ట్రా ఫ్లోర్,పెంట్ హౌస్ ఏ నిర్మాణమైన సరే పత్రికలకు అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఇతర పై కూడా పెత్తందారీగా బెదిరింపులుకు పాల్పడుతున్నాడు.వాళ్ల అనుకుంటే ఎమ్మెల్యే, కార్పొరేటర్,అధికారుల్ని ని సైతం తప్పు దోవ పట్టించి బుట్టలో వేసుకుంటారు. ఇతని వేధింపులు తాళలేక గతంలో బస్తి,కాలనీ వాసులు వీళ్ళపై, కాలనీలో వచ్చినప్పుడు దాడి చేయడానికి సిద్ధపడ్డారు, వీళ్ళబాగోతాలు తెలిలంటే ఈ బిల్డింగ్ లకు సంబంధి యజమానులను కలిస్తే మీకు స్పష్టంగా అర్థం అవుతాయి, ఇలాంటి ఉదాహరణలు ఇంకెన్నో ఉన్నాయి అంటునే స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు,కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ దృష్టికి తీసుకు వచ్చిన బిల్డింగ్ యజమాని అంకారావు తన బాధను ఎమ్మెల్యే,కార్పొరేటర్ కు తెలియజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూడివిజనలోఎవరైనా అక్రమ వసూళ్లు పాల్పడినట్లయితే పోలీసు అధికారులకు కంప్లైంట్ చేయాలన్ని తెలియజేశారు.