విశాఖలో ఎస్‌బీఐ కోహినూర్ ప్రీమియర్ శాఖ ప్రారంభం
విశాఖపట్నం : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోహినూర్ ప్రీమియర్ బ్యాంకింగ్ పేరుతో కొత్త శాఖను విశాఖలోని పాండురంగపురంలో ప్రారంభించింది. హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాకేష్‌శర్మ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 24 గంటలు లాకర్ సదుపాయం ఉంటుందని తెలిపారు. విలాసవంతమైన ఈ లాంజ్, కాఫీ బార్ వంటి అధునాతన సదుపాయాలను ఈ శాఖలో కల్పించామన్నారు. హైదరాబాద్ తరువాత రాష్ట్రంలో ఇది రెండోదని, విజయవాడలో మూడో శాఖను తెరిచే ప్రతిపాదన ఉందని వెల్లడించారు.



