విశాఖలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ర్యాలీ

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్టు వెంటనే ప్రకటించాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి డిసెంబరు 9 ప్రకటనపై స్పందించిన తీరును విద్యార్థి తప్పుబాట్టారు. కేంద్ర ప్రభుత్వంలో ఇంత కదలిక వస్తున్నా స్పందించకుండా సీమాంధ్ర మంత్రులు మౌనంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యవహారాలపై రోడ్‌మ్యాప్‌కు తాము వ్యతిరేకమని ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఈసందర్భంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.