విష జ్వరాలు ప్రబలడంతో రాంపురం తండాలో వైద్య శిబిరం ఏర్పాటు

విష జ్వరాలు ప్రబలడంతో రాంపురం తండాలో వైద్య శిబిరం ఏర్పాటు

టేకులపల్లి, సెప్టెంబర్ 29( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలో రోజు రోజుకి విష జ్వరాల బారిన పడి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. గ్రామపంచాయతీ పాలకులు శానిటేషన్ సక్రమంగా నిర్వహించకపోవడంతో మురికి కాలువలు, దోమల స్వైర విహారం చేస్తూ ప్రతి గ్రామంలో విష జ్వరాల బారిన పడుతున్నారు. సంబంధిత మండల అధికారుల పర్యవేక్షణ లోపంతో మండలంలోని చాలా గ్రామపంచాయతీలలో అరకొర మొక్కుబడిగా శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారని, కేవలం కాగితాలపై, ఫోటో స్టిల్స్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, సర్పంచులు, కార్యదర్శులు ప్రతి వారం శానిటేషన్ పనులు నిర్వహించడం లేదని, పలు గ్రామాలలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక గ్రామంలో జ్వరాల బారిన పడి మృత్యువాతకు గురైతే తప్ప విష జ్వరాల బారిన పడుతున్న పలు గ్రామాలను ఏ అధికారులు సందర్శించకపోవడం ఇక్కడి అధికారుల పనితీరుకు అడ్డం పడుతుంది. ఉన్నతాధికారులు దృష్టి సారించి మండల వ్యాప్తంగా విష జ్వరాలపై యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా వైద్య శిబిరాలను, ఫాగింగ్, శానిటేషన్ పనులను ముమ్మరంగా కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారు. రాంపురం తండా గ్రామానికి చెందిన డెంగ్యూ జ్వరంతో ఖమ్మం పట్టణంలో వైద్య చికిత్సలు పొందుతూ మాలోతు రతన్ అనే యువకుడు గురువారం మృత్యువాత పడ్డాడు. దీంతో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం అప్రమత్తమై వైద్యాధికారి కందుల దినేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రాంపురం గ్రామంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 53 మందికి చికిత్స అందించారు. 27 మందికి