వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వంవెంటనే అమలు చేయాలి
జనం సాక్షి : నర్సంపేట
నర్సంపేట మండల కేంద్రంలో వీఆర్ఏలు గత 39 రోజులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విఆర్ఎ లు సమ్మె చేయడం జరుగుతుంది. గురువారంఈ సమ్మెకు మద్దతుగా సంఘీభావం తెలియ చేస్తూ ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మోడెమ్ మల్లేశం హాజరై ఈ కింది విధముగా మాట్లాడటం జరిగినది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు బేసిక్ పే స్కేల్ జీవోను అమలు చేస్తానని అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పిస్తానని, 55 సంవత్సరములు పైబడిన వీఆర్ఏలకు వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగినది. వీఆర్ఏలు తమ హక్కులు సాధించుకునే వరకు పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, వారికి అండగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గం ఉంటుందని వారి పోరాటంలో భాగస్వామ్యం అవుతామని తెలుపటం జరిగినది. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు కామ్రేడ్ ఈర్ల పైడి తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మరియు జిల్లా నాయకులు కామ్రేడ్ ఈరేల్లి రామచందర్ పాల్గొన్నారు.